‘ఎన్టీఆర్’పై నిత్యా ఆసక్తికర కామెంట్స్!!!

  • June 30, 2016 / 06:45 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ చూస్తే, మతిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ జనతా గ్యారేజ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో నిత్య మీనన్ సైతం నటిస్తుంది. ఆమె ఈ సినిమాలో చేస్తున్నది రెండో హీరోయిన్ పాత్ర అయినప్పటికీ ఆ పాత్ర చాలా కీలకం అని సినిమాను మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి నిత్యా ఒక ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ…ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది…ఇంతకీ నిత్య ఎన్టీఆర్ గురించి ఏమన్నది అంటే…మాములుగా  నటీనటులు అంతా కెమెరా ముందు నటిస్తారు. కానీ ఎన్టీఆర్ జీవిస్తాడు అని అంటూనే…ఎన్టీఆర్ ఒక యాక్టర్ కాదు సైన్యం లాంటివాడు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసింది. అదే క్రమంలో జనతా గ్యారేజ్ లో ఒక అనుభవాన్ని వివరిస్తూ…నేను ఒక సీన్ లో సరిగ్గా నటించలేక ఎన్నో సార్లు టేక్ తీసుకున్నాను, అన్ని టేక్స్ తీసుకున్నా ఎక్కడా విసుగు లేకుండాతనకు సహకరించిన ఎన్టీర్ వ్యక్తిత్యం చూసి నేను జూనియర్ కు అభిమానిగా మారిపోయాను అంటుంది నిత్యా. ఇక ఎప్పుడూ లేనిది నిత్య ఇలా మాట్లాడటం కాస్త కొత్తగా అనిపించినా….ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus