హీరోయిన్ల జీవితాలు కొవ్వొత్తుల్లాంటివి అంటుంటారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొన్నట్లు క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలు చేసి వీలైనన్ని కోట్లు వెనకేసుకొంటారు. సో సినిమాలు చేయాలంటే హీరోయిన్ కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం మంచి స్ట్రక్చర్. నటన అనేది అందమైన కథానాయికకి మన తెలుగు చిత్రసీమలో ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అందుకే.. ఖాళీ దొరికినప్పుడు హాలీవుడ్ ట్రిప్పులకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కంటే.. జిమ్ లలో గంటల తరబడి వర్కవుట్ చేయడానికి ఇష్టపడుతుంటారు కథానాయికలు.
అయితే.. “అలా మొదలైంది”తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ.. హైట్ కారణంగా కొన్ని సినిమాలు వాదులుకోవాల్సి వస్తే, ఇప్పుడు అధిక బరువు కారణంగా ఇంకొన్ని సినిమాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయమై నిత్యామీనన్ ను అడగగా.. “నా జీవితంలో చాలా సమస్యలున్నాయి. ఇప్పుడు బరువు అనేది నాకు పెద్ద ఇబ్బంది కాదు. అవసరం అనుకొంటే.. త్వరలోనే తగ్గించుకోగలను. అయినా.. నా బాడీ, నా బరువు, నా ఇష్టం” అంటూ సమాధానమిచ్చింది. ఆమె శరీరం ఎంత ఆమె ఇష్టమైనా సరే ఇటీవల “అ!” ప్రమోషన్స్ లో భాగంగా ఆమెను చూసినవాళ్ళందరూ నిజంగానే “ఆ” అంటున్నారు. మరి ఈ చక్కనమ్మ ఎప్పటికీ చిక్కుతుందో చూడాలి.