Nithya Menon: నిత్యా మేనన్ కి చేదు అనుభవం.. ఆ హీరో వల్లేనట..!

నిత్యా మేనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘అల మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ’24 ‘ ‘జనతా గ్యారేజ్’ ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె అందరి హీరోయిన్లకంటే ప్రత్యేకమనే చెప్పాలి. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం అలాగే పాటలు కూడా పాడటం ఈమెలో ఉన్న స్పెషల్ ట్యాలెంట్.

అంతేకాదు ఏ భాషలో సినిమా చేసినా.. ఎక్కువశాతం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటుంది నిత్యా మేనన్. అలాగే ఈమెలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. అది ఓ రకంగా ఈమెకు అభిమానులను తెచ్చిపెడితే.. ఇంకో రకంగా అవకాశాలు రాకుండా చేసింది అని చెప్పాలి. అదేంటి అంటే.. ఈమెకు ఉన్న ముక్కుసూటితనం, అలాగే ఈమెకు పాత్ర నచ్చకపోతే సినిమాలకు సైన్ చేయకపోవడం, అంతేకాకుండా ఈమెను సన్నబడమని చెబితే దర్శకనిర్మాతలు తిట్టిపోయడం.

అందుకే ఈమెకు అవకాశాలు కరువయ్యాయి అని చెప్పాలి. అలాంటి (Nithya Menon) నిత్యా మేనన్ ని కూడా ఓ హీరో ఇబ్బంది పెట్టాడట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. నిత్యమేనన్ మాట్లాడుతూ.. ” టాలీవుడ్లో నాకు అంతా మంచి గౌరవం ఇస్తుంటారు. ఇప్పటికీ నన్ను చాలా బాగా చూసుకుంటారు.టాలీవుడ్లో నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ కోలీవుడ్లో మాత్రం నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది.

ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న టైంలో ఓ తమిళ హీరో నన్ను పదే పదే అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. అతని చేష్టల కారణంగా ఆ సినిమాను కంప్లీట్ చేయడం నాకు చాలా కష్టమైంది” అంటూ చెప్పుకొచ్చింది నిత్యా మేనన్.కానీ అది హీరో ఎవరు అన్నది మాత్రం ఈమె బయటపెట్టలేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus