రజినీతో షూటింగ్ లో పాల్గొంటున్న నివేధా థామస్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. ఇది రజినీ కాంత్ కు 166 వ సినిమా. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్.. మొదటి షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఈమద్యే ఈ షెడ్యూల్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార జాయినయ్యింది. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ నివేధా థామస్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే.తాజా ఈ షెడ్యూల్ లో ఆమె కూడా జాయినయ్యింది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గానూ అలాగే… కామన్ మాన్ గానూ.. డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ యంగ్ స్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడు. రజినీ మనవడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అదే సమయానికి రావొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus