బాహుబలి లాంటి సినిమా తీయాలనుకొని మళ్ళీ ఫెయిలైన బాలీవుడ్

మన రాజమౌళి “బాహుబలి”తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ కొట్టినప్పట్నుంచి.. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల దర్శకులు ఆ రికార్డ్ ను బ్రేక్ చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నారు. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ మాత్రమే “కేజీఎఫ్”తో బాహుబలి దరిదాపుల్లోకి రాగలిగాడు. కానీ.. మలయాళం, తమిళం మరియు హిందీ దర్శకులు మాత్రం ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే వచ్చారు. తాజాగా బాలీవుడ్ నుంచి మరో దర్శకుడు రాజామౌళి స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించి “బాహుబలి”కి గట్టి పోటీ ఇవ్వాలనుకున్నాడు. వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ లాంటి ఘనాపాటీలు అందరూ కలిసి నటించిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది.

మొదటి షో కే సినిమాను డిజాస్టర్ అని తేల్చేశారు. సినిమా మొత్తంలో గ్రాఫిక్స్, సెట్స్ తప్ప ఏమీ లేకపోవడంతో థియేటర్ కి వచ్చిన జనాలు ఇదేం సినిమారా అనుకుంటూ పరిగెడుతున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన మరో డిజాస్టర్ గా ఈ చిత్రాన్ని ఆల్రెడీ తేల్చిపాడేశారు. సినిమా మొత్తం పూర్తయ్యాక కూడా ప్రేక్షకుడికి కథ అర్ధం కాకపోవడం, కథనం సరిగా లేకపోవడం, క్యారెక్టరైజేషన్స్ అనేవి సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో.. సినిమా ఫ్లాపయ్యింది. ఓవరాల్ గా.. రాజమౌళి లాగా భారీ సెట్స్ తో సినిమా తీసి హిట్ కొట్టేద్దామని బాలీవుడ్ చేసిన మరో ప్రయత్నం కూడా దారుణంగా బెడిసికొట్టింది. ఇప్పటికైనా బాలీవుడ్ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బలమైన కథ లేనప్పుడు ఎన్ని భారీ సెట్స్ ఉన్నా జనాలు సినిమాను చూడరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus