“మజిలీ” సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సమంత 70%, నాగచైతన్య 20% మిగతా 10% దర్శకుడు శివ నిర్వాణ ఖాతాలోకి వెళ్లిపోవడంతో.. సినిమాలో కీలకపాత్రధారి మరియు కథలో మలుపుకి కారకురాలైన దివ్యాంస కౌశిక్ కి మాత్రం క్రెడిట్ కాదు కదా కనీసం గుర్తింపు కూడా లభించలేదు. పాపం ముందు నుంచీ పాపని పెద్దగా మీడియా కళ్ళల్లో కూడా పడనివ్వలేదు చిత్రబృందం. సినిమా విడుదలయ్యాక కూడా ఆమె మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందరి చూపు చైసామ్ ల మీదే ఉండిపోవడంతో దివ్యాంశాను గుర్తించేవారు లేకుండాపోయారు.
దాంతో “మజిలీ” అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా దివ్యాంశకు ఇప్పటివరకూ మరో అవకాశం కాదు కదా కనీసం ఎంక్వైరీ కూడా రాలేదు. దాంతో ఏం చేయాలో అర్ధం కానీ దివ్యాంశ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో తన హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ.. అటెన్షన్ గ్రాబ్ చేయడానికి నానా ఇబ్బందులుపడుతోంది. మరి అమ్మడి శ్రమను ఎవరైనా గుర్తించి ఆమెకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.