Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

ఏదో ఒకసారి జరిగితే కాకతాళీయం.. రెండోసారి జరిగితే ‘సమ్‌థింగ్‌ ఈజ్‌ దేర్‌’ అనిపిస్తుంది. అది కూడా వెంటవెంటనే జరిగితే కచ్చితంగా సమ్‌థింగ్‌ ఈజ్‌ దేర్‌ అనిపిస్తుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ చేయబోతున్న సినిమాల దర్శకులు.. ఓ ఇద్దరు దర్శకులు వద్దు అనుకున్న దర్శకులు కావడం గమనార్హం. దీంతో అన్నదమ్ములు వద్దనుకున్న ఇద్దరు దర్శకులతో ఇప్పుడు తండ్రీ కొడుకులు నటిస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తంగా నలుగురు హీరోలు నందమూరి కుటుంబానికి చెందిన వారే కావడం ఇక్కడ మేజిక్‌.

Nandamuri

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘దాదా’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబరు 24న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్‌ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇటీవల ఈ సినిమా ఉండదు అనే రూమర్స్‌ రాగా.. లేదు లేదు మేం చేస్తున్నాం అంటూ సినిమా టీమ్‌ ప్రకటించింది. కాబట్టి ఆ సినిమా పక్కాగా ఉంది..

ఇక ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ ‘కొత్త’ తొలి సినిమాను అనౌన్స్‌ చేశారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది అని ఇటీవల ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. దీంతో గతంలో ప్రకటించిన ప్రశాంత్‌ వర్మ సినిమా.. ఆ తర్వాత బాలకృష్ణ డైరక్షన్‌లో ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ సినిమా, క్రిష్‌ డైరక్షన్‌లో సినిమా అంటూ వచ్చిన వార్తలు అన్ని ఆగిపోయాయి. దసరాకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం.

ఈ రెండు సినిమాల సంగతి చూస్తే.. కొరటాల శివను ఎన్టీఆర్‌ వద్దనుకున్నారు అనే విషయం గుర్తొస్తుంది. ‘దేవర 2’ సినిమా ఇక లేదని ఎన్టీఆర్‌ తేల్చేయడంతోనే కొరటాల ఇటు వచ్చారు. ఇక ‘బింబిసార 2’ సినిమా నుండి మల్లిడి వశిష్ఠ తప్పకున్నారు. అలా అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులను తండ్రీకొడుకులు తీసుకున్నారు అని తేలింది.

‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus