యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్ చేసింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టి ముందుస్థాయిలో దూసుకుపోయింది. ఈ షో వల్ల స్టార్ మా ఛానల్ ని చూసే వారి సంఖ్య నాలుగు రేట్లు పెరిగిందంటే ఎన్టీఆర్ పవర్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అందుకే ఆ ఛానెల్ వాళ్ళు సీజన్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం కంటెస్టెంట్ సెలక్షన్ వేగంగా జరుగుతోంది. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వారితో పాటు ఇతర రంగాల వారు కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ సారి కంటెస్టెంట్ తో పాటు రోజులు కూడా పెరగనున్నట్లు తెలిసింది. మొదటి సీజన్లో 14 మంది 70 రోజుల పాటు బిగ్ హౌస్ లో ఉండేందుకు వచ్చారు ఇప్పుడు 18 మంది 100 రోజుల పాటు హౌస్ లో ఉండేందుకు పోటీ పడనున్నారు. జూన్ నుంచి మొదలయ్యే ఈ రియాలిటీ షో కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించినట్లు ఫిలింనగర్ వాసులు తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న షూటింగ్ లో పాల్గొంటూనే బిగ్ హౌస్ కి ఎన్టీఆర్ వెళ్లి రానున్నారు.