ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ “ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు” అనే రెండు సినిమాలు ఎనౌన్స్ చేయడమే కాక ఆ రెండు సినిమాలను ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ లో విడుదల చేయనున్నామని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వగా.. ఆర్జీవీ ఇమ్మీడియట్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే ప్రొజెక్ట్ ను జనవరి 24న విడుదల చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. క్రిష్ బయోపిక్ లో ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచేవారకూ చూపించనున్నారన్న విషయం తెలిసిందే. అయితే.. వర్మ అందుకు ఇంకో అడుగు ముందుకేసి.. ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతితో పరిచయం అనంతరం ఏం జరిగింది అనేది తన సినిమాలో “రక్త చరిత్ర” తరహాలో చూపించనున్నాడని సమాచారం.
అయితే.. రెండు పార్ట్శ్ కు కంటిన్యూటీగా వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఆర్జీవీ కౌంటర్ ఇవ్వనున్నాడు క్రిష్. ముందు ప్రకటించినట్లుగా రెండో భాగాన్ని జనవరిలో కాక ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నాడు క్రిష్. దాంతో.. ఇప్పుడు వర్మ తిరుపతిలో పట్టుబట్టలు కట్టుకొని మరీ స్వామివారి సన్నిధానంలో ప్రకటించినట్లుగా జనవరి 24న తన చిత్రాన్ని విడుదల చేస్తాడా లేక క్రిష్ ప్రొసెస్ ను ఫాలో అవుతూ తన చిత్రాన్ని కూడా ఫిబ్రవరి లేదా మార్చికి పోస్ట్ పోన్ చేస్తాడా అనేది తేయాల్సి ఉంది.