అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ‘ఎన్టీఆర్’ ట్రైలర్..!

  • January 1, 2019 / 01:38 PM IST

‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ మరియు ‘వారాహి చలన చిత్రం బ్యానర్ల పై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసింది.క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా.. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగం ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేస్తుండగా….. ఫిబ్రవరి 7వ తేదీన ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

ఇందులో భాగంగా.. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే వేడుకలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఇప్పటివరకూ 10 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ట్రైలర్ తోనే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కీరవాణి అందించిన నేపధ్య సంగీతానికి, బుర్రా సాయిమాధవ్ అందించిన సంభాషణలు అందరినీ అలరించాయనే చెప్పాలి. ‘ఎన్టీఆర్’ పాత్రలో బాలకృష్ణ గెటప్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. విద్యాబాలన్, రకుల్, నిత్యామీనన్, హన్సిక,రానా,సుమంత్, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో పోషించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus