పూరి ‘ఇజం’లో ఎన్టీఆర్…!

  • September 9, 2016 / 11:32 AM IST

తన కథలకు తగ్గట్టు హీరోలను సరికొత్తగా తీర్చిదిద్దడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ ది అందవేసిన చేయి. రవితేజ మాస్ మహారాజ్ అనిపించుకున్నా, బన్నీ, ఎన్టీఆర్ తాజాగా కళ్యాణ్ రామ్ ఆరు పలకల దేహంతో దర్శనమిచ్చినా వాటి వెనుక అసలు సూత్రధారి ఈ డాషింగ్ డైరెక్టరే. ఆ రకంగా పూరిని సిక్స్ ప్యాక్ దర్శకుడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ చొరవో లేక సొంత ప్రయత్నమే కారణమో గానీ కళ్యాణ్ రామ్ తో ‘ఇజం’ సినిమా చేస్తున్నారు పూరి. కళ్యాణ్ రామ్ లుక్, ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తెచ్చిపెట్టాయి.

అటు ఎన్టీఆర్-పూరిల బంధం కూడా మరింత బలపడింది. వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తారని గుసగుసలు వినపడుతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే పూరి-కళ్యాణ్ రామ్ ‘ఇజం’లో ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో నటిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎప్పటినుండో ఎన్టీఆర్ తో కలిసి ఒకేతెరపై కనపడాలని కళ్యాణ్ రామ్ తాపత్రయపడుతున్నారు. పూరి ఈ కోరికను మన్నిస్తారో లేదో మరి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus