బిగ్ బాస్ షోతో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్!
- July 27, 2017 / 12:18 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అభిమానులు బుల్లి తెరలోకి ఘనంగా స్వాగతం పలికారు. స్టార్ మా ఛానల్లో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ ఈనెల 16 న ప్రసారమైంది. ఆరోజు నందమూరి అభిమానులతో పాటు, టీవీ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్టీఆర్ స్టెప్పులతో షోని ప్రారంభించి, మాటలతో ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ టెలివిజన్ రంగంలో కొత్త రికార్డుని నెలకొల్పింది.
ఆ రోజు ప్రసారమైన షోకి 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) నమోదైంది. ఇంత ఏ ఇతర తెలుగు రియాలిటీ షోకి నమోదు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” గేమ్ షోకి 5.80 రేటింగ్ మాత్రమే వచ్చింది. సెలబ్రిటీలు పాల్గొనే సమయంలో ఈ రేటింగ్ 7 దాకా వెళ్లేది. మెగాస్టార్ చిరంజీవికి సైతం కూడా రేటింగ్ ని ఎన్టీఆర్ సాధించి ఔరా అనిపించారు. ఎన్టీఆర్ బుల్లితెర రికార్డ్ ని బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరి తరం కాదని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















