వన్ మిలియన్ ని క్రాస్ చేసిన ఎన్టీఆర్ ఫాలోవర్స్ సంఖ్య
- June 27, 2017 / 02:31 PM ISTByFilmy Focus
నాన్నకు ప్రేమతో సినిమాలో.. “ఫాలో ఫాలో” అనే పాట మాదిరిగా అభిమానులు ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు. 2009 సెప్టెంబర్ లో ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన తారక్ ని ఫ్యాన్స్ ఫాలో అవడం మొదలెట్టారు. అప్పట్లో పోస్ట్ లపై పెద్దగా దృష్టి పెట్టని ఎన్టీఆర్ టెంపర్ ఇచ్చిన విజయ ఉత్సాహంతో తన సినిమా విషయాలతో పాటు, కుటుంబ సంగతులను అభిమానులతో పంచుకోవడం షురూ చేశారు. దీంతో ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్కును దాటింది. ప్రస్తుతం తారక్‌ను 10,00,224 మంది అనుసరిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుస హిట్లు అందుకొని ఎన్టీఆర్ ఫుల్ ఫామ్లోకి వచ్చారు.
త్వరలో బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ గా నిరూపించుకోనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జైలవకుశ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ జులై తొలివారంలో రిలీజ్ కానుంది. సినిమా మాత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













