మహేష్ ని డామినేట్ చేసిన ఎన్టీఆర్

  • August 10, 2017 / 01:39 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. తమతమ బాటని వదిలి కొత్త తరహా కథలతో సాహసాలు చేస్తున్నారు. విజయాలను అందుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ మంత్రం తో హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడు త్రి పాత్రాభినయంతో అలరించడానికి శ్రమిస్తున్నారు. మహేష్ బాబు తొలి సారి ద్వి భాష చిత్రాన్ని చేస్తున్నారు. అయితే మహేష్ బాబుని ఎన్టీఆర్ మించిపోయారు. ఎలాగంటే.. స్టార్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా స్పైడర్. ఇది 150 కోట్లతో తెరకెక్కుతోంది. బాహుబలి, రోబో 2.0 సినిమాల తర్వాత దక్షిణాదిలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ ఇదే. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేటర్ రైట్స్ 70 కోట్లు పలికాయి.

ఇక బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా బడ్జెట్ 60 కోట్ల లోపే. అయినప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడు పోయాయి. ధర రెండు చిత్రాలకు సమానమైనప్పటికీ బడ్జెట్ తో పోలిస్తే మహేష్ పై ఎన్టీఆర్ పై చేయి సాధించారు. మరి కలక్షన్ల విషయంలో ఎవరు ముందుంటారో సెప్టెంబర్ లో తెలియనుంది. జై లవకుశ సెప్టెంబర్ 21 న వస్తుండగా, 27 న స్పైడర్ పలకరించనున్నాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus