ఒక్కోసారి అదృష్టం మనల్ని దురదృష్టం కంటే దారుణంగా వెంటాడుతుంటుంది. ఎంత అదృష్టవంతుడు కాకపోతే.. తనకు “బృందావనం” చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన దిల్ రాజు స్వయంగా వచ్చి ఒక అద్భుతమైన కథ చెప్పడం, అది కూడా “శతమానం భవతి”తో నేషనల్ అవార్డ్ అందుకొన్న డైరెక్టర్ తో సినిమా అనగానే మరో కథానాయకుడైతే ఎగిరి గెంతేసేవాడేమో. కానీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కథ వినడానికి బాగున్నా సినిమాగా వర్కవుట్ అవ్వదని గ్రహించి వద్దని చెప్పేయడంతో ఓ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకొన్నాడు. ఆ ఫ్లాప్ సినిమా మరేదో కాదు “శ్రీనివాస కళ్యాణం”.
నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిద్దామనుకొన్నారట. కథ ఎన్టీఆర్ కు చెప్పడం, ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలెడదామని దిల్ రాజు ప్లాన్ చేసుకొన్న తర్వాత ఎన్టీఆర్ “ఈ ప్రొజెక్ట్ వర్కవుట్ అవ్వదు రాజు గారు” అని సైడైపోవడంతో తెరపైకి నితిన్ వచ్చాడు. ఇక ఇప్పుడు సినిమా రిజల్ట్ ఏమిటనేది మీ అందరికీ తెలిసిందే. ఆ విధంగా మంచి టైమ్ లో మంచి డెసిషన్ తీసుకొని ఎన్టీఆర్ పెద్ద ఫ్లాప్ నుంచి తృటిప్రాయంలో తప్పించుకొన్నాడు.