సాయం వారి నైజం!!
- May 13, 2016 / 10:04 AM ISTByFilmy Focus
మహా నటుడు నందమూరి తారక రామారావు పేదల పాలిట దేవుడు. అన్నా అంటే ఆదుకునే గొప్ప మనిషి. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆయన బాటలోనే నడుస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా అంతే. తమ స్థాయికి తగ్గ సహాయం చేస్తుంటారు.
అనారోగ్యంతో బాధ పడుతున్న స్వాతి అనే అమ్మాయికి ఆపరేషన్ కోసం 50,000 రూపాయలు డొనేట్ చేయడానికి మండ పేట ఎన్టీఆర్ అభిమానులు ముందుకు వచ్చి తన దానగుణాన్నిమరో మారు చాటుకున్నారు. స్వాతికి ఈ సాయాన్నిఎన్టీఆర్ మనవడు జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా అందజేశారు. జనతా గ్యారేజీ షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ గా ఉన్నాఅభిమానులు చేస్తున్న మంచి పనిని ప్రోస్తహించడానికి ఆయన టైం కేటాయించారు. అమ్మాయికి అండగా నిలిచినందుకు వారిని అభినందిచారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













