ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజమౌళి సర్ ప్రైజ్..?

‘అరవింద సమేత’ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. రాజమౌళి తో ఏ హీరో సినిమా చెయ్యాలి అని డిసైడ్ అయినా.. ఆ హీరో అభిమానులకు రెండేళ్ళ వరకూ వెయిటింగ్ తప్పదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఈసారి 2020 జూలై 30 కే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తాను అని రాజమౌళి అలాగే నిర్మాత డి.వి.వి దానయ్య లు.. ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి.. ఎన్టీఆర్ అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కూడా నమ్మేశారు.

ఇక్కడ చరణ్ అభిమానులకు కొంచెం పర్వాలేదు. 2019 లో ‘వినయ విధేయ రామ’ సినిమా చూసే అవకాశం దక్కింది. ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున.. అల్లూరి సీతా రామరాజు పాత్రలో చరణ్ చేస్తున్న వీడియోని చూసే అవకాశం కూడా వారికి దక్కింది. కానీ ‘లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన కొమరం భీమ్ వీడియోని విడుదల చేయలేకపోతున్నాం’ అని రాజమౌళి మరియు దానయ్యలు చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చారు.

దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పై చాలా కోపంగా ఉన్నారు. ’70 శాతం షూటింగ్ పూర్తయ్యింది అని లాక్ డౌన్ కు ముందే చెప్పావ్ కదా.. కనీసం ఓ పోస్టర్ కూడా విడుదల చెయ్యలేకపోయావా?’ అంటూ రాజమౌళి పై మంది పడుతున్నారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోని సాధ్యమైనంత త్వరగా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాడట. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి కావడంతో ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోని ఆ రోజు విడుదల చెయ్యాలని పనులు మొదలుపెట్టాడట జక్కన్న. మరి ఈసారైనా రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus