Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

ఒక సినిమా తెరకెక్కడానికి కథ, నటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా చాలామంది కారణం. ఒకరు లేకపోయినా పని అవ్వదు. అదే ఓ సినిమా విడుదలకు ముందు కావాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే.. ‘పాజిటివ్‌ వైబ్‌’ అని చెప్పాలి. మీరు చదివింది కరెక్టే. ప్రస్తుతం సినిమా టీమ్‌లు ఈ విషయం మీదే దృష్టి పెడుతున్నాయి. సినిమా గురించి ఎక్కడా వాయిస్‌ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. థియేటర్లకు తొలి రోజు, తొలి ఆటకు వచ్చే ప్రేక్షకుడు.. సినిమా మీద ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో రావాలి అనేది వారి కోరిక.

Ntr -Lenin

దీని ప్రకారమే సినిమా గురించి ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో పాజిటివ్‌ వైబ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇప్పుడున్న సోషల్‌ మీడియా పంచాయితీలకు ఈ మాత్రం చేయాలి కూడా. దీంతోపాటు ఓ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉండాలి. పైన చెప్పిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్న విడుదలకు రెడీ అయిన సినిమా ‘లెనిన్‌’. ఈ సినిమా మొదలవ్వడం, రిలీజ్ అవ్వడంలో లేట్‌ అయినా.. లేటెస్ట్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేస్తున్నారు. అదనపు హంగులు కూడా అద్దుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ తన దగ్గర ఉన్న ఆఖరి అస్త్రాన్ని కూడా వాడేశారు. ఆయన దగ్గరున్న అతి పెద్ద అస్త్రం ఎన్టీఆర్‌ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు సంబంధించి తారక్‌ని ఎక్కడో దగ్గర వాడతారు. అంటే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌, సక్సెస్ మీట్‌, మీట్‌ ది హీరో.. ఇలా చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ‘లెనిన్‌’ సినిమా కోసం వాయిస్‌ ఓవర్‌ని ఎన్టీఆర్‌తో చెప్పించేసి తన దగ్గర ఉన్న మెయిన్‌ లైఫ్ లైన్‌ను కూడా వాడేశారు అని చెప్పాలి.

అఖిల్‌ హీరోగా మురళీ కిషోర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లెనిన్‌’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ సినిమాను జులై 10న విడుదల చేస్తున్నారు. సినిమా ట్రైలర్‌కు నాగార్జున వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘లెనిన్‌’ కథను ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత ఎన్టీఆర్‌కి ఇచ్చారు. సినిమాలోని కీలక అంశాలను తారక్‌ గొంతుతో ప్రేక్షకులకు పరిచయం చేస్తారట.

‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus