విలన్ కి చేయి అందించిన ఎన్టీఆర్
- February 28, 2017 / 08:08 AM ISTByFilmy Focus
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ ముందు ఉంటారు. సాయం కోరిన వారికి అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యులతో సమానంగా తోటి నటీనటులను, తన అభిమానులను ప్రేమిస్తారు. ఈ విషయం తాజాగా మరో మారు స్పష్టమయింది. శక్తి, ఊసరవెల్లి చిత్రాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్యుల్ కి ఎన్టీఆర్ సాయం చేశారు. విద్యుత్ హీరోగా నటించిన కమాండో 2 మార్చ్ 3 న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. మిత్రుడు విద్యుత్ కి శుభాకాంక్షలు తెలిపారు.
తన సినిమా ట్రైలర్ ని షేర్ చేయడంతో విద్యుత్ ఆనందం వ్యక్తం చేశారు. “ఎన్టీఆర్ మంచి నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నాకున్న మంచి స్నేహితుడు. నా సినిమా ట్రైలర్ ని షేర్ చేసి మంచితనాన్ని మరో మారు నిరూపించుకున్నారు” అంటూ విద్యుత్ మీడియా ముందు చెప్పారు. ప్రస్తుతం తారక్ బాబీ దర్శకత్వంలో నటించడానికి మేకవర్ పై దృష్టిపెట్టారు. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం ప్రదర్శించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














