జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా వలన కెరీర్ లో మొదటిసారి వెండితెరకు ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. దానికితోడు కరోనా కూడా పెద్ద దెబ్బే కొట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ఎనౌన్స్ చేసిన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. RRR అయిపోగానే కొరటాల శివ సినిమాతో బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే కొరటాల ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు. కరోనా తగ్గిన తరువాత దర్శకులు, హీరోలు గ్యాప్ లేకుండా షూటింగ్ పనులతో చాలా బిజీ కానున్నట్లు అర్ధమవుతోంది.
అంతే కాకుండా ఇతర ఆర్టిస్టులు కూడా బిజీ బిజీగా మారిపోతారు. ఇక కొరటాల శివ అందుకే ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఆచార్య అయిపోగానే సినీ ఆర్టిస్టుల కాల్షీట్స్ కూడా రెడీ చేయాలని ఇప్పటికే నిర్మాతకు చెప్పేశాడట. సహాయక దర్శకులు సైతం జెట్ స్పీడ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. సినిమా మొదలైన ఆరు నెలల్లో షూటింగ్ మొత్తం అయిపోయేలా పక్కా ప్రణాళికతో సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొరటాల కూడా మరో సినిమా చేసుకోవాలి.
లేటయితే మరొక స్టార్ హీరో దొరకడం కష్టం. ఎన్టీఆర్ కూడా సలార్ అయిపోగానే ప్రశాంత్ నీల్ తో జాయిన్ అవ్వాలి. అతను కూడా జెట్ స్పీడ్ ప్లాన్ తోనే ఉన్నాడు. మొత్తానికి RRR సినిమాతో పాటు, కొరటాల – ఎన్టీఆర్ సినిమా కూడా తొందరగానే రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. మరి కొరటాల ఆ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.