ఆఫీసర్ కంటే దారుణమైన కలెక్షన్స్ తో మహానాయకుడు

  • February 23, 2019 / 07:50 PM IST

“ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రానికి వచ్చిన రిజల్ట్ చూసి సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వదనే విషయాన్ని టీం ముందే ప్రిపేర్ అయ్యింది కానీ… నిన్న జనాలు సినిమాను రిసీవ్ చేసుకున్న విధానం చూసి క్రిష్ ఖంగుతిన్నాడు, ఇక బాలయ్య మొత్తానికి సైలెంట్ అయిపోయాడనుకోండి. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండిట్స్ కూడా షాక్ అయ్యారు. నాగార్జున కెరీర్ లోనే కాక తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేర్కొనే “ఆఫీసర్” సినిమా ప్రారంభ వసూళ్లను కూడా “ఎన్టీఆర్ మహానాయకుడు” బీట్ చేయలేకపోయాడు. దాంతో షాక్ అవ్వడం జనాల వంతైంది.

అయితే.. ఈ సినిమా ఫెయిల్యూర్ తప్పు మాత్రం కేవలం కథా రచయిత, దర్శకుడు క్రిష్ ది మాత్రమే. కనీస స్థాయిలోనూ ఆకట్టుకోలేకపోయిన ట్రైలర్, ఆసక్తి పెంచలేకపోయిన పాటలు, ప్రోమోలు కలగలిసి “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ “ఎన్టీఆర్ కథానాయకుడు” కంటే పెద్ద ఫ్లాప్ ను చేశాయి. ఇది కచ్చితంగా అవమానకరమైన విషయమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus