బాబాయి మాత్రమే చెయ్యగలడు – ఎన్టీఆర్!!!

టాలీవుడ్ లో నందమూరి నట సింహం క్యాలిబర్ గురించి…ఆయన సినిమాల్లో ఉండే రౌద్రమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….అయితే అదే క్రమంలో ఇప్పటివరకూ తెలుగులో ఏ హీరో చెయ్యలేని…ప్రయోగాలు….సాహసవంతమైన సినిమాలను బాలయ్య చేశాడు అనే చెప్పాలి…ఇదిలా ఉంటే తన 100వ సినిమాని ప్రతిష్టాత్మకంగా చెయ్యాలి అన్న ఆలోచనతో ఇప్పుడున్న ట్రెండ్ ను మార్చి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాలనే ప్రయత్నంలో ప్రతిష్టాత్మక 100వ చిత్రంగా గౌతామీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు మన బాలయ్య….ముందు ఈ సినిమాని అందరూ రొటీన్ సినిమా అనుకున్నారు కానీ…ఒక్క లుక్ తో…ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాడు మన నందమూరి నట సింహం…నేను దిగితే ఎదురు వచ్చేది ఎవడు..ఢీ కొట్టేది ఎవడు అన్నట్లుగా ఉంది ఆ టీజర్….ఇక ఈ టీజర్ తో ఒక్కసారిగా పరిణామాలు అన్నీ మారిపోయాయి.

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీగా శాతకర్ణి మారిపోయింది…ఇప్పుడు ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు….యావత్ ప్రేక్షకులే కాదు….టాలీవుడ్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది….తాజాగా శాతకర్ణి టీజర్ చూసినయంగ్ టైగర్ ఎన్టీఆర్….ఈ టీజర్ కి ఫిదా అయిపోయాడట…అంతేకాదు….ఈ పాత్ర బాబాయ్ తప్ప ఎవ్వరూ…..చెయ్యలేరు…ఇలాంటి సినిమాలు…పాత్రలు, బాబాయి ఒక్కడికే సాధ్యం అని బాబాయిని తెగ పొగిడేసాడని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న వార్త…మరి అదే నిజం అయితే నందమూరి అభిమానులకు అంతకన్నా పండగ ఏముంటుంది చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus