ది ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) వేడుక రెండోసారి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. మంగళవారం మొదలైన దక్షిణాది ఐఫా ఉత్సవంలో భాగంగా… రెండో రోజైన బుధవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకి చెందిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాల్ని ప్రదానం చేశారు. జనతా గ్యారేజ్ లో అద్భుత నటనకు గాను ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడిగా అవార్డును అందజేశారు. జనతా గ్యారేజ్ కి అత్యధికంగా అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం(జనతా గ్యారేజ్), ఉత్తమ డైరక్టర్ (కొరటాల శివ), ఉత్తమ సంగీత దర్శకుడు(దేవీ శ్రీ ప్రసాద్), ఉత్తమ గేయ రచయిత (రామ జోగయ్య శాస్త్రి), ఉత్తమ గాయని (గీతామాధురి) కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది.
ఇక ఉత్తమ నటి గా సమంత కు అవార్డు ప్రదానం చేశారు. అ.. ఆ చిత్రంలోని నటనకు గాను ఈ అవార్డు లభించింది. రానా, నాని కలిసి చేసిన యాంకరింగ్ ఆకట్టుకోగా, అఖిల్, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్, కేథరిన్, రాశీ ఖన్నా, కృతిక, రాయ్‌లక్ష్మీ తదితరులు చేసిన సందడి అతిథులను అలరించాయి. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.