త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల నెక్స్ట్ సినిమా స్టోరీ ఫిక్స్ అయ్యింది

జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయం సొంతం చేసుకొన్న “అరవింద సమేత” చిత్రం ఎన్టీఆర్ అభిమానులకు చాలా స్పెషల్ ఫిలిమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఇచ్చిన ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. కానీ.. త్రివిక్రమ్ నుంచి జనరల్ ఆడియన్స్ ఆశించే స్థాయి హాస్యం కానీ పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో మిస్ అయ్యాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒకింత నిరాశకు గురయ్యారు.

ఆ లోటు తీర్చేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో తాను తెరకెక్కించబోయే తాజా చిత్రం “అరవింద సమేత”లా సీరియస్ ఫిలిమ్ లా కాకుండా త్రివిక్రమ్ మార్క్ బ్రీజీ లవ్ ఎంటర్ టైనర్ లా ఉండేలా జాగ్రత్త తీసుకొంటున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించబోయే ఈ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ఇమ్మీడియట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఉంటుంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus