అన్ని విధాలుగా సత్తా చాటుతున్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు వారసత్వంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన వారే. ఇద్దరికీ ప్రత్యేకంగా అభిమాన బ్యాంక్ ఉంది. కెరీర్ తొలి దశలో ఎన్టీఆర్ సింహాద్రితో రికార్డులు సృష్టించగా రామ్ చరణ్ దానిని మగధీర తో తిరిగి రాసాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ నెలకొని ఉంది. చెర్రీ సేఫ్ కథలను ఎంచుకుంటూ కలక్షన్ల విషయంలో స్టడీ కొనసాగించాడు. తారక్ మాత్రం పడుతూ లేస్తూ వచ్చాడు.

ఎన్టీఆర్ టెంపర్ తో నిలదొక్కుకొని హిట్ ట్రాక్ లో పడ్డాడు. 2015 లో వచ్చిన ఈ మూవీ రూ.43 కోట్ల షేర్ సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా రూ.55 కోట్ల షేర్ వసూల్ చేసింది. దీంతో జనతా గ్యారేజ్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి విపరీతమైన వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా రూ.83 కోట్ల షేర్ సాధించి మగధీర పేరిట ఉన్న రికార్డులను చెరిపి వేసింది. ప్రస్తుతం హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ జూలు విదిలించిన సింహంలా ఉన్నాడు. వేగం పెంచిన చిరుత పులిలా కనిపిస్తున్నాడు. చెర్రీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

గత చిత్రం బ్రూస్లీ అపజయం పాలవడంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే సంవత్సరం నుంచి ధృవ కోసం కష్టపడుతున్నాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయినా నెటిజనుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు.  ఈ చిత్రంతో తారక్ ని అందుకోగలడా అని పరిశ్రమ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు. మరి రామ్ చరణ్ పవర్ తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Reason Behind Jr NTR Gaining Weight - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus