ఫ్రెండ్ బర్త్ డే వేడుకలో లక్ష్మి ప్రణతి, ఎన్టీఆర్
- June 9, 2017 / 06:26 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి నెమ్మదస్తురాలు. సిగ్గు కూడా ఎక్కువే. అందుకే తారక్ తో కలిసి ప్రణతి పబ్లిక్ ఫంక్షన్ కి అరుదుగా వస్తుంటుంది. ఇప్పటివరకు ఆమె మాట్లాడగా చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ఆమె తొలిసారి పార్టీలో సందడి చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలు దిగింది. హైదరాబాద్ ఫిలిం సర్కిల్ లో బాగా పాపులర్ అయిన కీర్తి అనే పేజ్ 3 సెలబ్రిటీ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ ని నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక గ్రాండ్ గా నిర్వహించింది.
బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి, నారా రోహిత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితర సినీ తారలు హాజరయ్యారు. ఈ పార్టీలో ఎన్టీఆర్, ప్రణతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఆనంద పడ్డారు. అలా ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఫోటోల ద్వారా ఎన్టీఆర్, ప్రణతి ఎంజాయింగ్ మూమెంట్స్ అందరికీ తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















