‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్‌నే మార్చేసేలా భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ స్థాయిలో మళ్లీ కలెక్షన్లు సాధించడానికి తగిన సినిమా ఇంకా రాలేదు. ‘దేవర 1’ (Devara) మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నప్పటికీ, 500 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఎన్టీఆర్ మాత్రం ఆ కలెక్షన్స్ విషయంలో సంతృప్తి చెందలేదని టాక్. అయితే తన తర్వాతి సినిమాలన్నీ 1000 కోట్ల టార్గెట్‌తోనే లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మొదటిగా బాలీవుడ్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ‘వార్ 2’ చిత్రాన్ని సైన్ చేశాడు.
హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం వల్ల ఉత్తరాదిలో తారక్‌కు మాస్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు స్ట్రాంగ్ మార్కెట్‌ను అందించనుందని సినీ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చేయబోతున్నాడు. ‘సలార్’ (Salaar)లా ప్యూర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది.
నీల్ మేకింగ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే 1000 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా చేరడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఇది తారక్ కెరీర్‌లో మరో డిఫైనింగ్ ప్రాజెక్ట్ కానుందని స్పష్టమవుతోంది. అలాగే కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ (Jailer) డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తో (Nelson Dilip Kumar) ఎన్టీఆర్ ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు టాక్ ఉంది. రజినీకాంత్‌తో 800 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన నెల్సన్, ఇప్పుడు తారక్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా మినిమమ్ 1000 కోట్ల టార్గెట్‌తోనే ఉండనుందని అంటున్నారు.
క్రేజీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న కథలను కొత్తగా చూపించడంలో నెల్సన్ స్ట్రాంగ్ డైరెక్టర్. ఇక పుష్ప 2 (Pushpa 2) గ్రాండ్ సక్సెస్ తర్వాత దేవర 2 కథ కూడా డెవలప్ అవుతున్నట్లు సమాచారం. ఫుల్ స్కేల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా దేవర 2 ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి తారక్ లైనప్ చూస్తుంటే, రాబోయే ఏళ్లలో అతని సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే ఫీలింగ్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.