నోటీసులు అందుకున్న బాలకృష్ణ, క్రిష్

  • June 28, 2018 / 01:53 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ ని అద్భుతంగా తెరకెక్కించాలని బాలకృష్ణ, క్రిష్ కలలు కంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా బాలీవుడ్ స్టార్స్ ని తీసుకుంటున్నారు. స్టార్ హీరోలు సైతం నటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చేనెల ఐదవతేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్లడానికి అంత సిద్ధం చేస్తున్న వేళ పెద్ద అడ్డంకి వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పోటీ పడే సమయంలో అతని ఎదుగుదలను అడ్డుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు విశ్వప్రయత్నాలు చేసారని.. సీనియర్ నేతలు చెబుతున్నారు. అందుకే ఆ రోల్ సినిమాలో బాగా పండాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సచిన్ కెడెకర్  ను తీసుకున్నారు.

ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని, కావాలని ఉద్దేశ్యపూర్వకంగానే నాదెండ్ల భాస్కరరావును ఈ చిత్రంలో నెగిటివ్‌గా చూపించనున్నారని ఆరోపిస్తూ సినిమా నిర్మాణాన్ని ఆపాల్సిందిగా బాలకృష్ణ కి నోటీసులు పంపించారు. మొదట ఎమ్మెల్యే హోదాలో నోటీసు పంపి, మళ్లీ చిత్రంలోని ప్రధాన నటుడు, నిర్మాత హోదాలో ఇంకో నోటీసు పంపారు. అలాగే దర్శకుడు క్రిష్‌కు కూడా నోటీసు పంపినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మరి ఈ నోటీసుల పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus