NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?
- September 30, 2026 / 11:52 PM ISTByPhani Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నిన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమాకి నిర్మాత రాజమౌళి తనయుడు కార్తికేయ. కాబట్టి ఇది ఎన్టీఆర్ హోమ్ బ్యానర్లో రూపొందిన ప్రాజెక్టు లాంటిదే. ఎందుకంటే ఎన్టీఆర్ కి మొదటి సక్సెస్ అందించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతోనే రాజమౌళి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ కాంబో నుండి వచ్చాయి.
NTR

అలాగే రియల్ లైఫ్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కి గాడ్ ఫాదర్ లాంటివారు. అందుకే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనేది ఎన్టీఆర్ సొంత బ్యానర్లో రూపొందిన సినిమా లాంటిదే అని చెప్పొచ్చు.అయితే నిన్న ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ.. రాజమౌళితో కంటే కూడా తనకి కార్తికేయతోనే బాండింగ్ ఎక్కువ అన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నప్పుడు.. ఆయన తల్లి రాలేదట. తండ్రి హరికృష్ణ కూడా ‘నీ కాళ్ళ పై నువ్వే నిలబడాలి’ అని చెప్పి రాలేదట. ఒంటరిగా ఆ సినిమా ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. అందుకే దేవుడు తనకు అభిమానుల రూపంలో, రాజమౌళి కుటుంబం రూపంలో పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఆ తర్వాత కార్తికేయ తనకు సొంత తమ్ముడిలా అండగా నిలబడ్డాడట. తన ఆనందంలోనే కాదు, వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా పక్కనే ఉండి తన కన్నీళ్లు తుడిచాడని.. అందుకే కార్తికేయ తనకు తమ్ముడితో సమానం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో కళ్యాణ్ రామ్ సంగతేంటి? ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మధ్య బాండింగ్ తగ్గిందా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.













