పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అయితే కాస్త బ్యాడ్ న్యూస్ కూడా. పవన్ – సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. ఈ మేరకు సినిమా టీమ్ నిన్న రాత్రి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఫ్యాన్స్‌కి గుడ్ న్యూసే కదా అని మీరు అనొచ్చు. అయితే ఆ షూటింగ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదు. అవును ఆయన లేకుండా ఆయన సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
పొలిటికల్ అసైన్‌మెంట్ వంద శాతం స్ట్రయిక్ రేట్‌తో బలమైన హిట్ కొట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు సినిమాల విషయం తేల్చడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తన లైనప్‌లో ఉన్న సినిమాల షూటింగ్‌లు వరుస పెడుతున్నారు. అలా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ను ఇటీవల స్టార్ట్ చేశారు. విజయవాడ సమీపంలో సెట్ వేసి సినిమా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఓజి’ సెట్ కూడా అక్కడే వేశారని టాక్.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రీస్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే ఏపీ రాజకీయాలు, పరిస్థితుల్లో కొన్ని మార్పుల వల్ల పవన్ దీక్ష చేపట్టారు. అదంతా పూర్తయి ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో షూటింగ్‌లకు తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ‘ఓజీ’ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే ప్రశ్న కూడా వినిపిస్తుండటం గమనార్హం.
ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నాడు. ఆయనతో త్వరలో షూటింగ్ అని సమాచారం వచ్చింది. అయితే అడివి శేష్ సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడటంతో.. ఆ ఆలోచనలకు కాస్త విరామం ఇచ్చారు అని టాక్. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, రిలీజ్ చేయాలన్న నిర్మాత డీవీవీ దానయ్య ప్రయత్నాలు ఎట్టకేలకు మంచి ఫలితం చూస్తున్నాయి అని చెబుతున్నారు.