Nikhil: ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’ ఒకసారైనా నిఖిల్‌ వస్తాడా?

నిఖిల్‌ (Nikhil) సినిమాల లైనప్‌ ఏంటి అని అడిగితే.. మొన్నీమధ్య వరకు ‘స్వయంభూ’, ‘ది ఇండియా హౌస్‌’, ‘కార్తికేయ 3’ అని చెప్పేవారు. అయితే హఠాత్తుగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ ఓ సినిమా మధ్యలోకి వచ్చేసింది. తర్వాత ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చే సినిమా కాదు.. పూర్తయిపోయి రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసుకున్న సినిమా అని చెప్పడంలో ఆశ్చర్యపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, లేటెస్ట్‌ ప్రశ్న ఏంటంటే.. ఈ సినిమా గురించి నిఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడా ఒక్క పోస్ట్‌ కూడా కనిపించడం లేదు.

Nikhil

పోనీ ప్రెస్‌ మీట్‌, ఇంటర్వ్యూలు లాంటివి పెడుతున్నాడా అదీ లేదు. దీంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న విషయం ఆయనకు తెలుసా? రిలీజ్‌ అవ్వడం ఆయనకు ఓకేనా అనేదే ప్రశ్నగా మారింది. అదేంటి తన సినిమా రిలీజ్‌ తనకు ఇష్టం ఎందుకు ఉండదు అని అడగొచ్చు. విషయం ఏంటంటే.. ఈ సినిమా కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమాను ప్రారంభించారు నిఖిల్‌. తన స్నేహితుడు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలతో మొదలుపెట్టారు.

అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది అని సమాచారం. ఎందుకు ఆగింది, ఎంతవరకు షూట్‌ అయింది అనేది తెలియడం లేదు. అయితే ఉన్న ఫుటేజ్‌ నుండి సినిమాను సిద్ధం చేశారు అని చెబుతున్నారు. మరోవైపు నిఖిల్‌ చేతిలో ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. ‘కార్తికేయ 2’ ఇచ్చిన విజయంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఆయన పేరు వినిపించింది.

ఇప్పుడు అదే పనిలో ‘స్వయంభూ’, ‘ది ఇండియా హౌస్‌’ అనే పాన్‌ ఇండియా భారీ సినిమాలు భుజానికి ఎత్తుకున్నాడు. ఈ సమయంలో ఈ సినిమా వస్తే కెరీర్‌ పరంగా ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటున్నాడని ఓ టాక్‌ ఉంది. మరి ఏది నిజమో ఆయనే చెప్పాలి. అన్నట్లు సుధీర్‌ వర్మ – నిఖిల్‌ గతంలో ‘స్వామి రా రా’ అనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. దానికి ముందు నుండే ఈ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా.

ఇద్దరు స్టార్‌ హీరోలు బిగ్‌బాస్‌ను వదిలేశారు.. నెక్స్ట్‌ ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus