బేబీ హిట్టు లిస్ట్ లో చేరిపోయింది ..!

స‌మంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం మొదటి వారం పూర్తి చేసుకుంది. నంద‌నీరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాక.. రెండో రోజు స్టడీ గా రాణించి.. మూడో రోజు మాత్రం మొదటి రోజుని మించి కలెక్షన్లను రాబట్టాయి. ఇక వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టడం విశేషం. సీనియర్ నటి లక్ష్మీ,రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా అతిధి పాత్రలో కనిపించాడు.

ఇక మొదటి వారం ‘ఓ బేబి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.09 కోట్లు
సీడెడ్ – 1.00 కోట్లు
వైజాగ్ – 1.05 కోట్లు


గుంటూరు – 0.48 కోట్లు
ఈస్ట్ – 0.46 కోట్లు
వెస్ట్ – 0.38 కోట్లు


కృష్ణా – 0.62 కోట్లు
నెల్లూరు – 0.22 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 7.30 కోట్లు (షేర్)
—————————

రెస్టాఫ్ ఇండియా – 1.30 కోట్లు
ఓవర్సీస్ – 2.65 కోట్లు
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోటల్ = 11.25 కోట్లు (షేర్)
————————————–

‘ఓ బేబీ’ చిత్రం ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల వరకూ అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 11.25 కోట్ల షేర్ ను రాబట్టింది. సో మొదటి వారంతోనే బ్రేక్ ఈవెన్ అవ్వడంతో.. సమంత ఖాతాలో మరో హిట్టుపడినట్టయ్యింది. ఈ వారం విడుదలైన సినిమాలకి అంతగా మంచి టాక్ రాలేదు. కాబట్టి రెండో వారాన్ని కూడా సమంత క్యాష్ చేసుకునే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus