ఓపెనింగ్స్ అదిరిపోయాయి బేబీ..!

స‌మంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం నిన్న విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నంద‌నీరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి టాక్ రావడంతో సాయంత్రానికి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. సీనియర్ నటి లక్ష్మీ,రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా అతిధి పాత్రలో కనిపించాడు. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు అదిరిపోయాయి. సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యూ టర్న్’ చిత్రానికి మించి ‘ఓ బేబీ’ కలెక్షన్లు ఉన్నాయి.

ఇక మొదటి రోజు ‘ఓ బేబి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 0.59 కోట్లు
సీడెడ్ – 0.17 కోట్లు
వైజాగ్ – 0.20 కోట్లు

గుంటూరు – 0.09 కోట్లు
ఈస్ట్ – 0.08 కోట్లు
వెస్ట్ – 0.07 కోట్లు

కృష్ణా – 0.12 కోట్లు
నెల్లూరు – 0.04 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 1.36 కోట్లు (షేర్)
—————————

రెస్టాఫ్ ఇండియా – 0.45 కోట్లు
ఓవర్సీస్ – 1.0 కోట్లు
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోటల్ = 2.81 కోట్లు (షేర్)
————————————–

‘ఓ బేబీ’ చిత్రం ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికీ 7వరకూ వసూళ్ళ ‘ఓ బేబి’ రాబట్టే అవకాశం ఉంది. థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. సో మొదటి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం విజయంతో మరోసారి సమంత స్టార్ ఇమేజ్ ఏంటనేది నిరూపించబడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus