ఈసారి హిట్ కన్ఫర్మ్!!!

సందీప్ కిషన్…టాలీవుడ్ లో నెగేటివ్ పాత్రలో…తన “ప్రస్థానాన్ని” మొదలు పెట్టిన ఈ కుర్ర హీరో హిట్స్, ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా…వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..తాజాగా సందీప్ హీరోగా…నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. సినిమాలో అందాల భామ నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదే క్రమంలో  ఈ సినిమాకు మిక్కి జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికీ విడుదలయిన ఈ పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి… ఇదిలా ఉంటే…తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తుణ్న్ అవదన ప్రకారం….ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని, యు సర్టిఫికేట్ తో జూన్ 10 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఈ క్రమంలో నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా సందీప్‌ కిష‌న్‌ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ అవ్వబోతున్న చిత్రం, ఇంకా చెప్పాలి అంటే…అయన కు ఒక మైలు రాయి వంటిది అంటూ సినిమాపై ఆయనకు ఉన్న భరోసాను తెలిపారు..ఇక దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ”నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను.

ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. అంటూ తెలిపారు…ఈ హడావిడి అంతా చూస్తుంటే సందీప్ ఈసారి కన్ఫర్మ్ గా హిట్ కొడతాడేమో అన్న ఆలోచన అప్పుడే మొదలయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus