అక్కినేని అఖిల్ ను హీరోగా లాంచ్ చేసిందే దర్శకుడు వి.వి.వినాయక్. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ చిత్రంతో లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కెట్ ఏర్పడేలా చేశాడు అని చెప్పాలి. దీంతో అఖిల్ లాంచింగ్ కు వినాయక్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని నాగార్జున భావించి అతని చేతిలో పెట్టారు. అలా ‘అఖిల్’ అనే సినిమా వీరి కాంబినేషన్లో రావడం జరిగింది.
అది అంచనాలను అందుకోలేదు కానీ… అఖిల్ సినిమాల్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే అఖిల్ మంచి డాన్సర్ అని, ఫైటర్ అని ప్రూవ్ చేసింది. సో అఖిల్ కు మంచి లాంచింగ్ ఇవ్వడంలో వినాయక్ ఫెయిల్ అవ్వలేదు.. అతనికి సక్సెస్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. వినాయక్ – అఖిల్ మళ్ళీ చేతులు కలుపుతున్నారు అని తెలుస్తుంది.
ఇప్పుడు ఇద్దరికీ మంచి సక్సెస్ కావాలి. ఈ ఏడాది అఖిల్ (Akhil) నుండి వచ్చిన ‘ఏజెంట్’, వినాయక్ నుండి వచ్చింది ‘ఛత్రపతి'(హిందీ) అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం అఖిల్ ఓ కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడు. మరోపక్క వినాయక్ తో వర్క్ చేయడానికి కూడా అఖిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కథ – స్క్రీన్ ప్లే ఓ టాప్ రైటర్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. వినాయక్ డైరెక్షన్ మాత్రమే చేస్తారని తెలుస్తుంది.