Anil Ravipudi, Kalyan Ram: నందమూరి హీరోలతో అనిల్‌ రావిపూడి వరుస సినిమాలు!

తనను దర్శకుడిగా మార్చిన హీరోతో సినిమా చేయాలంటే ఏ దర్శకుడికైనా ఆనందమే. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’తో తన దర్శక ప్రయాణం మొదలవ్వడానికి కారణమైన కల్యాణ్‌రామ్‌తో సినిమా చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇటీవల ఇద్దరూ కలిశారని, కాన్సెప్ట్‌ ఒకటి ఓకే అనుకున్నారని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే నందమూరి హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నట్లే.

‘ఎఫ్‌ 3’తో మంచి విజయం అందుకున్న అనిల్‌ రావిపూడి ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేయాల్సిన సినిమా కథ గురించి కసరత్తులు మొదలుపెట్టారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఎప్పుడో ఓకే అయిపోయింది. ఇప్పడు దానికి బౌండెడ్‌ స్క్రిప్ట్‌/ డైలాగ్‌ వెర్షన్‌ను రెడీ చేస్తున్నారని సమాచారం. గోపీచంద్‌ మలినేని సినిమా పనుల్లో ఉన్న బాలయ్య.. ఈ సినిమాను విజయదశమి నుండి మొదలుపెడతారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి – కల్యాణ్‌రామ్‌ సినిమా మొదలవుతుందట.

కల్యాణ్‌రామ్‌తో మరో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు అనిల్‌ రావిపూడి. గతంలో కొన్ని సందర్బాల్లో ఈ విషయం వెల్లడించారు కూడా. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని టాక్‌. తొలి సినిమా ‘పటాస్‌’ లా ఈ సినిమాలోనూ కామెడీ డోస్ ఫుల్‌గా ఉంటుందని, టాక్‌. అయితే దాంతోపాటు సీరియస్ యాక్షన్ డ్రామా కూడా అంతే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. కల్యాణ్‌రామ్‌కు సరైన విజయం చాలా అవసరం అనుకుంటున్న సమయంలో అప్పుడు ‘పటాస్‌’ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక నందమూరి హీరోలతో వరుస సినిమాలు అన్నారు… ఎన్టీఆర్‌తో కూడా సినిమా ఉంటుందా? అనే ప్రశ్న వేద్దాం అనుకుంటున్నారా. ఆగండాగండి ఎందుకంటే తారక్‌తో కూడా సినిమా చేయడానికి అనిల్‌ రావిపూడి ఎప్పటి నుండో రెడీగా ఉన్నారు. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ మధ్య కాలంలో ఈ ముచ్చట్లు వినిపించకపోయినా.. ఈ ప్రాజెక్ట్‌ అయితే పక్కాగా ఉంటుంది అనే మాట వినిపిస్తోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus