ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లు పూర్తి చేసుకొన్న కాజల్, త్రిష, నయనతార వంటి సీనియర్ స్టార్ హీరోయిన్లందరూ వరుస అవకాశాలొస్తున్నప్పటికీ.. తెలుగు భాష మీద కానీ.. తెలుగు చలనచిత్రసీమ మీద కానీ ఏమాత్రం గౌరవం చూపకుండా ఇప్పటికీ కనీసం తెలుగులో మాట్లాడడం మాత్రమే కాక అర్ధం చేసుకోడానికి కూడా ప్రయత్నించకుండా కేవలం స్టార్ డమ్ తో నెట్టుకొచ్చేస్తుండగా.. సరికొత్త హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, నివేదా థామస్, సాయిపల్లవి వంటి ముద్దుగుమ్మలు మాత్రం తెలుగులో డిగ్రీ పూర్తి చేసి.. త్వరలో పీహెచ్డీ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు.
వారిలో మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి ఒకర్తి. పరిచయ చిత్రమైన “అ ఆ”లోనే సొంతంగా డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న అనుపమ.. తన తాజా చిత్రం “ఉన్నది ఒక్కటే జిందగీ”లోనూ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకొంటానంటోంది. రామ్ హీరోగా “నేను శైలజ” ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.