Chiranjeevi, Trisha: చిరుకి జోడీగా త్రిష ఫిక్స్.. కానీ అదొక్కటే టెన్షన్ పెడుతుందట..!

చిరు – త్రిష మళ్ళీ జంటగా నటించబోతున్నారు. 17 ఏళ్ళ క్రితం వచ్చిన ‘స్టాలిన్’ సినిమాలో ఈ జంట కలిసి నటించింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ టైంలో చిరు – త్రిష ల జోడీ పై విమర్శలు కురిసాయి.చిరు ఆ సినిమాలో కొంచెం పుష్టిగా ఉండటం.. త్రిష స్లిమ్ గా ఉండటంతో.. ఈ జంట సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది.

చిరు అప్పటికంటే స్లిమ్ అయ్యారు. ‘భోళా శంకర్’ టీజర్లో కనుక చూసుకుంటే చిరు లుక్స్ ఆకట్టుకున్నాయి. సో త్రిష – చిరు పెయిర్ ఈసారి ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్కటే టెన్షన్ పెడుతుంది. అదేంటి అంటే.. వాస్తవానికి చిరు – త్రిష ల ‘ఆచార్య’ తో రిపీట్ అవ్వాలి. కానీ అప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ వచ్చి చేరింది. చివరికి ఆమె పాత్ర కూడా లేకుండా పోయింది అనుకోండి. ‘ఆచార్య’ ఫలితంతో ఓ విషయం మాత్రం అందరికీ తెలిసొచ్చింది.

ఈ మధ్య కాలంలో త్రిష కథకి ప్రాధాన్యత ఉండే పాత్రలు అయితేనే చేస్తుంది అని..! ‘పొన్నియన్ సెల్వన్'(సిరీస్) తో ఆ విషయాన్ని తెలియజేసింది. ‘లియో’ చిత్రంలో కూడా ఆమెది మంచి పాత్ర అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిరుతో త్రిష చేయబోయే సినిమా విషయంలో కూడా టీంకి ఓ టెన్షన్ వచ్చి పడింది. చిరు పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేయనున్నాడు. బి.వి.ఎస్ రవి ఈ కథని రాయడం జరిగింది.

అయితే చిరు (Chiranjeevi) సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చిరు దగ్గరుండి మార్పులు వంటివి చేయిస్తారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో త్రిష పాత్రకి ప్రాముఖ్యత తగ్గేలా చిరు కనుక ఏమైనా మార్పులు చెబితే.. త్రిష మళ్ళీ ప్రాజెక్టు నుండీ తప్పుకునే ప్రమాదం ఉంది. అలాంటిదేమి జరగకుండా ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి మరి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus