మాట అన్నవారు కామ్‌గా ఉన్నారు.. సంబంధం లేకపోయినా ఆ మాటకు రియాక్ట్ అయిన ఆమె కూడా కామ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎవరి పని వారు చూసుకుంటున్నారు. కానీ మధ్యలో ఇతరులు చూపించిన ఆసక్తి వల్ల మరోసారి ‘సంప్రదాయ దుస్తులు’ చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. దీనికి కారణం ఓ టీవీ ఛానల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కాగా, దానికి రియాక్ట్ అయిన ఆ నటి కూడా. వాళ్లేదో పోస్టు పెట్టారు అని వదిలేయకుండా రిప్లై ఇచ్చి.. ఇష్యూని మరోసారి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు ఆ నటి.
పైన చెప్పిందంతా ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి, వాటిపై నటి అనసూయ చేసిన రిప్లై కామెంట్ల గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సినిమావాళ్లు ఈవెంట్లకు, బయటకు వచ్చినప్పుడు ‘ఈ యాంకర్‌లా పద్ధతైన వస్త్రధారణ వస్తే బాగుంటుంది. అప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు కదా’ అని నటుడు శివాజీ కామెంట్స్ చేశారు. అయితే ఆ మాటలతోపాటు ఒకట్రెండు అనకూడని, వాడకూడని పదాలను వాడేశారు. అవి ఆ తర్వాత పెద్ద చర్చకు దారి తీశాయి.
ఈ వ్యవహారంపై ఆ తర్వాత చాలామంది శివాజీని ఖండించినా, ఆయన విమర్శిస్తూ నానా మాటలు అన్నా.. అందులో నటి అనసూయ మాటలు, దానికి శివాజీ ఇచ్చిన రిప్లైలు వైరల్ అయ్యాయి. ఈ చర్చ ఇక సద్దుమణిగింది అనుకుంటుండగా.. ఇటీవల అనసూయ లేటెస్ట్ వీడియో గురించి ఓ టీవీ ఛానల్ పెట్టి పోస్టు వైరల్ అయింది. అనసూయ తన భర్త భరద్వాజ్‌తో కలసి ఇటీవల ఒక ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆమె ‘సంప్రదాయ చీరకట్టు’లో కనిపించారు.
ఆ వీడియో కింద ఓ నెటిజన్ శివాజీ దెబ్బతో పట్టు చీరలో తిరుగుతున్న అనసూయ.. అని కామెంట్ చేశాడు. దానికి అనసూయ స్పందిస్తూ తప్పు తప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ. ఇది కదా ఉండాలి టైటిల్‌లో. ఎందుకంటే అంతకుముందు మేమంతా సలు చీరలే కట్టుకోలేదు. అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. దీంతో వాళ్లిద్దరూ ఊరుకున్నా ఇతరులు ఇంకా ఈ విషయాన్ని ఇంకా రాజేస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.