మళ్ళీ పోస్ట్ పోన్ అయిన విజయ్ దేవరకొండ తాజా చిత్రం

  • May 8, 2019 / 06:22 PM IST

ఒక సినిమాకి విడుదల తేదీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే.. రిలీజ్ డేట్ బట్టే రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే.. కష్టమో నష్టమో ప్రకటించిన విడుదల తేదీకే చిత్రాన్ని విడుదల చేయడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తారు నిర్మాతలు. మరీ సినిమా పూర్తవ్వకపోవడమో లేక ఏదైనా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండిపోతే తప్పితే ప్రకటించిన విడుదల తేదీ నుంచి సినిమాను పోస్ట్ పోన్ చేయడానికి అస్సలు ఇష్టపడరు.

కానీ.. విజయ్ దేవరకొండకి మాత్రం ఈ పోస్ట్ పోన్లే అచ్చొచ్చినట్లున్నాయి. మునుపటి చిత్రం “ట్యాక్సీవాలా” కూడా ఇలాగే పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. ఇప్పుడు అదే తరహాలో “డియర్ కామ్రేడ్” కూడా ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయ్యింది. నిజానికి మే 31న సినిమాను విడుదల చేద్దామనుకున్నారు నిర్మాతలు. తర్వాత జూన్ కి మార్చారు. కానీ.. తాజా సమాచారం మేరకు సినిమా రిలీజ్ డేట్ ను జూలై 26కి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా “ట్యాక్సీవాలా” తరహాలో సూపర్ హిట్ అవుతుందా లేక ఎక్కువ హడావుడి చేస్తున్నారు కాబట్టి మరో “నోటా”లా మిగిలిపోతుందా అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus