Mahesh Babu, Anil Ravipudi: గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కన్ఫ్యూజన్ లో పెట్టిన మహేష్

మహేష్ బాబు కూడా మిగతా హీరోల మాదిరిగా భవిష్యత్తు ప్రాజెక్టులు బలంగా ఉండాలని ప్లాన్ సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ఫినిష్ కానుంది. ఇక ఇదే ఏడాది మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ అనుకున్న విషయం తెలిసిందే. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును వచ్చే ఏడాది స్టార్ట్ చేయాల్సి ఉంది.

ఇక ఈ మధ్యలో అనిల్ రావిపూడి సినిమా కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే మహేష్ తన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనిల్ రావిపూడి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.ఇక మహేష్ ఎప్పుడు ఓకే చెప్పినా కూడా సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంటానని కూడా అనిల్ వివరణ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని మహేష్ వరుసగా మూడు కమిట్మెంట్స్ ఇవ్వగా అనిల్ సినిమాను పూర్తి చేయడం సాధ్యమయ్యే పనేనా అని టాక్ వస్తోంది.

అనిల్ ఇచ్చిన క్లారిటీతో అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందుగా సర్కారు వారి పాట ఫినిష్ అయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus