మరో ప్రయోగానికి సిద్ధమైన మంజుల

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల.. షో, కావ్యాస్ డైరీ సినిమాల ద్వారా నటిగా నిరూపించుకున్నారు. అలాగే నిర్మాతగాను విజయం అందుకున్నారు. రీసెంట్ గా మెగా ఫోన్ పట్టి సందీప్ కిషన్, త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ లతో “మనసుకు నచ్చింది” అనే సినిమాని తెరకెక్కించారు. ఈ ప్రయోగాత్మక చిత్రం సినీ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.
“అ!” సినిమా అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ వర్మ తో ఓ వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారు. “అ!” మూవీ తర్వాత క్వీన్ రీమేక్ గా దటీజ్ మహాలక్ష్మి సినిమా చేస్తున్నారు.

అది షూటింగ్ పూర్తి కాగానే రాజశేఖర్ హీరోగా కల్కీ సినిమా మొదలు పెట్టారు. ఇది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దాని తర్వాత ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లో వెబ్ సిరీస్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఈ మధ్య వెబ్ సిరీస్ లకు మంచి గిరాకీ ఏర్పడింది. డిజిటల్ మీడియా విస్తరించడంతో మంచి లాభాలను సైతం అందిస్తున్నాయి. సినిమా నిర్మాణంలో పట్టు ఉన్న మంజుల తొలిసారి వెబ్ సిరీస్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus