ప్రగ్యా జైస్వాల్… అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమాలు ‘కంచె’, ‘అఖండ’. ఆ సినిమాల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. దాంతో ఆ సినిమాలే గుర్తొస్తుంటాయి. అయితే ‘కంచె’ ఆమె తొలి సినిమా కాదు. అంతకుముందే మూడు సినిమాలు చేసింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ మూడు సినిమాల్లో ఒకటి హిందీ సినిమా కూడా ఉంటుంది. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే… మళ్లీ ప్రగ్య హిందీలోకి వెళ్తోంది కాబట్టి.
అవును ఎప్పుడో 2014లో హిందీ సినిమాలో నటించిన (Pragya Jaiswal) ప్రగ్య జైస్వాల్ మళ్లీ ఇన్నాళ్లకు అంటే ఇప్పుడు 2024లో హిందీలో నటిస్తోంది. తమిళ చిత్రం ‘విరాట్టు’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. అప్పుడే హిందీలో ‘టిటూ ఎంబీఏ’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ‘కంచె’తో తెలుగులోకి వచ్చేసి… ఇక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా సరైన విజయం అందుకోలేకపోయింది. దీంతో కెరీర్ ఇక్కడ అయిపోయింది అని అంటున్న సమయంలో హిందీలోకి తిరిగి వెళ్లిపోయింది.
అక్షయ్ కుమార్, తాప్సి, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఖేల్ ఖేల్ మే’ అనే సినిమాలో ప్రగ్య కూడా నటిస్తోంది. 2016లో వచ్చిన ‘పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అనే ఓ ఇటాలీయన్ సినిమా రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్య ఓ కీలక పాత్రధారి అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఉదయ్‌పూర్‌లో జరుగుతోంది.
కొంతమంది స్నేహితులు ఓ రోజు డిన్నర్ కోసం ఒక చోట కలుస్తారు. ఈ సమయంలో ఒకరి సీక్రెట్స్ మరొకరికి తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్లంతా ఎవరు అనేది సినిమా. ఈ కథ స్ఫూర్తిగా ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇటీవల కాలంలో రీమేక్‌లు కలసి రాని బాలీవుడ్‌కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.
పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!