బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ కాస్త హద్దులు దాటుతున్నట్లుగానే అనిపిస్తోంది. పస్ట్ రెండు మూడు వారాల్లో హమీదా శ్రీరామ్ ల జంట లవ్ ట్రాక్ ని నడిపిస్తే, మరోసైడ్ మానస్ అండ్ పింకీల స్నేహం కూడా కాస్త హద్దుమీరుతోంది. నామినేషన్స్ రోజు ఏడుస్తున్న పింకీని మానస్ ఓదార్చాడు. అంతేకాదు, నేనేం చిన్నపిల్లాడిని కాదు అంటూ తర్వాత స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కూడా మానస్ వెంటనే పడుతూ అతని పనులు చేస్తూ పింకీ మానస్ చుట్టూ తిరుగుతోంది.
ఇక నామినేషన్స్ లో భాగంగా రవిని సేఫ్ చేసినందుకు మానస్ చాలా పర్సనల్ గా తీస్కున్నాడు. నిజానికి హౌస్ లో నాపై వీరిద్దరూ కలిసి స్కెచ్ గీశారా అనే అనుమానం కూడా కలిగింది. దీంతో మార్నింగ్ నిద్ర లేవగానే పింకీని దూరం పెట్టేశాడు. దీంతో బుంగ మూతి పెట్టుకున్న పింకీ కారణం చెప్పమని పదే పదే వెంట పడింది. ఎలాగోలా విషయాన్ని తెలుసుకున్న పింకీ మానస్ దగ్గరకి వచ్చి కాసేపు సారీ చెప్పింది. అయినా కూడా మానస్ గుండె కరగలేదు.
దీంతో అన్న కలుపుకు వచ్చి ముద్ద కావాలా ముద్దు కావాలా అంటూ గారాలు పోయింది పింకీ. కాజల్ సాక్షిగా ముద్దు పెడుతూ అన్నం ముద్దలు నోట్లో పెట్టింది. ఇక ఓవర్ చేయకు అంటూ మానస్ వార్నింగ్ ఇచ్చేసరికి ఆపేసింది. ఈ తతంగం మొత్తాన్ని చూస్తున్న కాజల్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. అంతేకాదు, అక్కడికి వచ్చిన రవి కాసేపు షణ్ముక్ ని ఇమిటేట్ చేస్తూ హౌస్ మేట్స్ ని నవ్వించాడు. అదీ మేటర్.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!