టాలీవుడ్‌లో జరగబోయే సెలబ్రిటీల కపుల్ పెళ్లిళ్ల గురించి అల్లు అరవింద్ కాస్త ముందే తెలుస్తుంది అని అంటుంటారు. గతంలో ఓసారి ఆయన చెప్పినట్లుగా ఓ హీరోయిన్.. మన ఇండస్ట్రీకి చెందిన హీరోనే పెళ్లి చేసుకోవడమే దానికి కారణం. ఆ హీరో అల్లు అరవింద్‌కి దగ్గరివాడే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? మరో హీరోయిన్‌కి అల్లు అరవింద్ ‘పెళ్లి’ సూచన చేశారు కాబట్టి. గతంలో లావణ్య త్రిపాఠికి చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన మృణాల్ ఠాకూర్‌కి కూడా చెప్పారు కాబట్టి.
అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మృణాల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు లావణ్య త్రిపాఠికి ఓ సలహా ఇచ్చాను.. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకో అని. అలా ఇక్కడే సెటిల్ అవ్వొచ్చు అని చెప్పాను. ఆ తర్వాత లావణ్య మా వరుణ్‌నే పెళ్లి చేసుకుంది అని చెప్పారు అల్లు అరవింద్.
ఇప్పుడు నీకు కూడా అలానే చెబుతున్నాను. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకో. అప్పుడు ఇక్కడే నువ్వు సెటిల్ అవ్వొచ్చు. పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయితేనే నిన్ను ఇక్కడే మేం ఇక్కడ ఉంచేయొచ్చు అని మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా ఇచ్చారు. ఆ మాటలకు స్టేజీ కింద ఉన్న అడివి శేష్, మృణాల్‌తో సహా ఇతర గెస్టులంతా పగలబడి నవ్వేశారు. మరి మృణాల్ తెలుగు వాడినే పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి. ఇప్పటికే ఓ సీనియర్ తెలుగు హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓ ఫొటో కూడా బయటకు వచ్చింది. ఆ మధ్య ధనుష్ – మృణాల్ ప్రేమ – పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. చూద్దాం త్వరలోనే మృణాల్ తీపి కబురు చెబుతుందేమో.