Nithiin, Kriti Shetty: కృతి శెట్టి – నితిన్ కాంబో రిపీట్!

Advertisement

నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా వచ్చింది. ఎడిటర్ ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై నిఖిత రెడ్డి, సుధాకర్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022 ఆగస్టు 12 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. విడుదల తేదీకి ముందు ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ‘రా రా రెడ్డి’ అనే పాట, టీజర్, ట్రైలర్ వంటివి అంచనాలు భారీగా పెంచేసాయి.

ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ మూవీ భారీ హైప్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. మొదటి షోకే అట్టర్ ప్లాప్ అని జనాలు తేల్చేశారు. అయితే నితిన్ – కృతి శెట్టి ల పెయిర్ మాత్రం బాగుంది. వారి నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. నితిన్ (Nithiin) ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీలో కృతి శెట్టిని కూడా హీరోయిన్ గా ఎంపిక చేసుకోబోతున్నారట. వాస్తవానికి ఈ మూవీలో రష్మిక మందన మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. కృతి శెట్టిది సెకండ్ హీరోయిన్ అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కృతి నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. మరి ఈ సినిమా అవుతుందో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news