Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Advertisement

ఈ నెల 10న అడివి శేష్‌ – మృణాల్‌ ఠాకూర్‌ సినిమా ‘డెకాయిట్‌’ విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఈ సినిమాకు పని చేసిన దర్శకులు. అదేంటి శానిల్‌ డియో ఒకరే కదా ఈ సినిమా దర్శకుడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా కోసం మరో దర్శకుడు కూడా పని చేశారు అని తేలింది. ఈ విషయాన్ని అడివి శేష్‌ అధికారికంగా చెప్పుకొచ్చారు.

Dacoit

తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో ఓ రేంజి హైప్‌ అందుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘డెకాయిట్‌’ అనే చెప్పాలి. దానికి కారణం సినిమా హీరోనే. ఆయన సినిమా చేస్తే విజయం పక్కా అనే నమ్మకం జనాల్లోకి రావడమే దానికి కారణం. అయితే ఇప్పుడు వస్తున్న ‘డెకాయిట్‌’, తర్వాత రానున్న ‘జీ 2’ సినిమాలు లేట్‌ అవుతూ ఉన్నాయి. దీని వల్ల ఏమన్నా బజ్‌ తక్కువ ఉంటుందేమో అని అనుకుంటే అదేం లేదు అని ‘డెకాయిట్‌’ నిరూపించింది.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌పై శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌చేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌లో మృణాల్ ఠాకూర్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. ఆ సీన్‌ అంత బాగా రావడానికి కారణం దర్శకుడు సుజీత్ అని చెప్పారు. అంటే ఇంటర్వెల్‌ బ్లాక్‌ను హ్యాండిల్‌ చేసింది సుజీత్‌ అన్నమాట. మరి ఎలాంటి సీన్‌, ఎలా తీశారు అనేది థియేటర్లలోనే చూడాలి. ఇది తేలాలి అంటే మరో రోజు ఆగితే సరి.

ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు శానిల్‌ డియో కాగా, అడివి శేష్‌ కూడా మేకింగ్‌లో తన హ్యాండ్‌ వేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఇద్దరికీ మూడో వ్యక్తి యాడ్‌ అయినట్లే. చూద్దాం సినిమా వచ్చాక ఇంకెవరైనా బయటకు వస్తారేమో.

ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus