Ooru Peru Bhairavakona Collections: ‘ఊరు పేరు భైరవకోన’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 22, 2024 / 03:14 PM IST

సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొందింది. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ లభించింది.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. గతంలో సందీప్ కిషన్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘టైగర్’ అనే మూవీ వచ్చింది.

అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. అందుకే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా గత వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది అని చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది.వీక్ డేస్ లో కూడా స్టడీగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.13 cr
సీడెడ్ 0.57 cr
ఉత్తరాంధ్ర 0.63 cr
ఈస్ట్ 0.38 cr
వెస్ట్ 0.30 cr
గుంటూరు 0.48 cr
కృష్ణా 0.46 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.68 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.89 cr (షేర్)

‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమాకు రూ.9.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.9.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రీమియర్స్ తో కూడా కలుపుకుని రూ.6.89 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.96 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus