వరుణ్ తేజ్ హీరోగా మాజీ మిస్ వరల్డ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ అయిన మానుషి చిల్లర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీ..లో ద్విభాషా చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించగా, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 5.20 cr |
సీడెడ్ | 2.40 cr |
ఉత్తరాంధ్ర | 2.00 cr |
ఈస్ట్ | 1.20 cr |
వెస్ట్ | 0.80 cr |
గుంటూరు | 1.00 cr |
కృష్ణా | 1.40 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 17.20 cr (షేర్) |
‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) చిత్రానికి రూ.17.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి రూ.17.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.
పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!