సోనమ్ కపూర్ పేరు మార్చుకోవడానికి అసలు కారణం అదే..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోన‌మ్ క‌పూర్ హీరోయిన్ గా పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఒక్క ‘నీర్జా’ ‘సంజు’ చిత్రాలు తప్ప ఈ అమ్మడికి పెద్దగా హిట్లు లేవు. ఇదిలా ఉండగా… ఇటీవల ఆమె పేరు మార్చుకుంది. 2018 లో సోనమ్… ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకున్న త‌ర్వాత సోష‌ల్ మీడియాలో త‌న పేరుని ‘సోన‌మ్ కె ఆహుజా’ గా మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ తన పేరుని ‘జోయా సింగ్ సోలంకి’ గా మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ఇంత సడెన్ గా సోన‌మ్ త‌న పేరుని ఎందుకు మార్చుకుంది అనుకుంటున్నారా…?

దీనికి ముఖ్య కారణం.. సోన‌మ్ కపూర్ తాజాగా న‌టిస్తున్న చిత్రం పేరు ‘ది జోయా ఫ్యాక్ట‌ర్‌’. ఈ చిత్రంలో జోయా అనే పాత్ర‌లో సోన‌మ్ కపూర్ క‌నిపించ‌బోతుంది. ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోన‌మ్ క‌పూర్ ఇలా త‌న పేరుని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో జోయా సింగ్ సోలంకి గా మార్చుకుందన్నమాట. ఇలా తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటుంది. ఇక ‘ది జోయా ఫ్యాక్ట‌ర్’ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ శ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా తనకి మంచి హిట్ ఇస్తుందని భావిస్తుంది సోనమ్ కపూర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus